తత్ + త్వం అనే రెండు పదాల కలయిక “తత్వం”. సంస్కృత భాషలో “తత్” అనే శబ్దానికి ఉన్న అర్థం “అది”. అది అంటే కనబడని ఒక శక్తి, ఈ విశ్వాన్ని నియమంచే ఒక మహత్తరమైన చైతన్య స్వరూపం. ఆ శక్తిని భారతీయులు భగవ్ంతుడు అని పిలుస్తారు. “త్వం” అంటే నీవు. అంటే ఆ “నీవు” ఇది చదువుతున్నప్పుడు “నేను”. నాకు- భగవంతునికి లేదా కంటికి కనిపించని ఈ జగత్తును శాసించే ఒక మహత్తర శక్తికి నాకు మధ్య ఉన్న సంబంధాన్నితత్వ జ్ఞానం అంటారు. ఈ తత్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగ పడే శాస్త్రం తత్వశాస్త్రం . అనాదిగా మానవుడు ఈ తత్వజ్ఞానాన్ని ఆశిస్తూ సాధన చేస్తూనే ఉన్నాడు. ఈ సాధన వైయ్యక్తికమైనది కాబట్టి పుట్టిన ప్రతి మనిషి ఈ సాధన చేస్తూనే ఉంటాడు. ఇలా కాలంలో పుట్టే – గిట్టే మనుషుల్లో ఎంతమందికి ఈ తత్వ జ్ఞానం పూర్తిగా తెలిసింది అనేది
గుహ్యమైన విషయం.
గుహ్యమైన విషయం.
- శ్రీమన్మధ్వాచార్యుల "తత్వజ్ఞాన ప్రదీపిక" అనే పుస్తకం నుంచి సంగ్రహించబడినది.
No comments:
Post a Comment